ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల పెంపు..!

కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిన జగన్‌ సర్కార్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల పెంపు..!

Edited By:

Updated on: Aug 13, 2020 | 9:01 PM

కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిన జగన్‌ సర్కార్‌ ఈ దిశగా మరో అడుగు ముందుకేసింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆస్పత్రుల్లో పడకలు లేకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించడానికి పడకల సంఖ్యను పెంచాలని కసరత్తు చేస్తోంది. 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలను 50 పడకలకు పెంచి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. తద్వారా మాతాశిశు సంరక్షణకు, నాణ్యమైన వైద్య సేవలకు పెద్దపీట వేయనుంది.

కరోనా కట్టడికోసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 51 ఆస్పత్రుల్లో 30 పడకల నుంచి 50 పడకలకు పెంచేందుకు కసరత్తు మొదలైంది. దీనివల్ల 1,020 పడకలు అదనంగా పెరగనున్నాయి. ఆయా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆస్పత్రి సామర్థ్యానికి మించి ఔట్‌పేషెంట్లు, ఇన్‌పేషెంట్లు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 51 సీహెచ్‌సీలకు కనిష్టంగా రూ.250 కోట్ల నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ