8 ప్రత్యేక కోర్టులు.. కేవలం ఆ కేసుల్లో మాత్రమే విచారణ

చిన్నారులపై రోజురోజుకు పెరిగిపోతున్న లైంగిక దాడులను విచారించేందుకు ఏపీ ప్రభుత్వం నూతనంగా 8 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. చిన్నారులు, బాలికలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై ఈ కోర్టులు ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నాయి. వీటి ద్వారా కేసులు వేగంగా పరిష్కరించబడే వీలు కలుగుంది. తద్వారా నిందితులకు శిక్షలు పడే వీలుంటుంది. బాలలపై లైంగిక వేధింపుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టులు విచారణ […]

8 ప్రత్యేక కోర్టులు.. కేవలం ఆ కేసుల్లో మాత్రమే విచారణ

Edited By:

Updated on: Sep 27, 2019 | 2:11 AM

చిన్నారులపై రోజురోజుకు పెరిగిపోతున్న లైంగిక దాడులను విచారించేందుకు ఏపీ ప్రభుత్వం నూతనంగా 8 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. చిన్నారులు, బాలికలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై ఈ కోర్టులు ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నాయి. వీటి ద్వారా కేసులు వేగంగా పరిష్కరించబడే వీలు కలుగుంది. తద్వారా నిందితులకు శిక్షలు పడే వీలుంటుంది. బాలలపై లైంగిక వేధింపుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టులు విచారణ జరుపుతాయి. వందకు పైగా పోస్కో చట్టం కేసులు పెండింగ్ ఉన్న జిల్లాల్లో ఈ ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు, విశాఖ,కృష్ణా,గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.