సీఎంఆర్‌ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం.. ఏసీబీ విచారణకు ఆదేశాలు

|

Sep 20, 2020 | 9:48 PM

ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నకిలీ చెక్కుల వ్యవహారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ కేసును ఏసీబీకి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

సీఎంఆర్‌ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం.. ఏసీబీ విచారణకు ఆదేశాలు
Follow us on

ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నకిలీ చెక్కుల వ్యవహారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ కేసును ఏసీబీకి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సీఎంఆర్ఎఫ్ నుంచి 117 కోట్లు స్వాహా చేసే కుట్రకు కొంతమంది యత్నించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలోని మూడు బ్యాంకుల ద్వారా నగదును మార్చుకునేందుకు దుండగులు ప్రయత్నం చేశారు. భారీ మొత్తం కావడంతో ఆయా బ్యాంకులు వెలగపూడిలోని ఎస్బీఐని సంప్రదించడంతో ఈ కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. (CMRF Fabricated Checks)

కాగా, సీఎం జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఏసీబీ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాలంటూ కోరారు. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంపై తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో సైతం కేసు నమోదు కాగా.. త్వరితగతిన ఏసీబీ కూడా కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..