అముల్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం

ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి...

అముల్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం

Edited By:

Updated on: Jul 21, 2020 | 3:10 PM

AP Government is Entering into a MoU with Amul Dairy : ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం జగన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌హెడ్‌ రాజన్‌ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మేనేజింగ్‌ డైరెక్టర్‌తో సీఎం జగన్‌ మాట్లాడారు.

అనంతరం జగన్‌‌ మాట్లాడుతూ.. మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగని అన్నారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వచ్చాయని, దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. వైఎస్సార్‌‌ ఆసరా, చేయూతల కింద మహిళలకు ఏడాదికి రూ. 11వేల కోట్లు, నాలుగేళ్లపాటు వారికి సహాయం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సహాయం వారి జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని జగన్ ఆకాంక్షించారు.