Breaking: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ పెంపు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

VAT Incerase On Petrol And Diesel: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను సవరించింది. పెట్రోల్‌పై రూ. 1.24, డీజీల్‌పై రూ. 0.93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వ్యాట్ చట్టం 2005ను సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనంగా సుంకాన్ని, అలాగే డీజీల్‌పై 22 శాతం వ్యాట్‌తో పాటు రూ. […]

Breaking: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ పెంపు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Updated on: Jul 21, 2020 | 1:32 AM

VAT Incerase On Petrol And Diesel: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను సవరించింది. పెట్రోల్‌పై రూ. 1.24, డీజీల్‌పై రూ. 0.93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వ్యాట్ చట్టం 2005ను సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనంగా సుంకాన్ని, అలాగే డీజీల్‌పై 22 శాతం వ్యాట్‌తో పాటు రూ. 4 అదనంగా సుంకాన్ని విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోవడంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సుమారు రూ. 4480 కోట్ల మేర రావాల్సిన రెవన్యూ ప్రస్తుతం రూ. 1323 కోట్లు మాత్రమే వస్తోందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత పెంపుదల 2015-18 సంవత్సరాల మధ్య వసూలు చేసిన ప్రకారమే ఉందని ప్రభుత్వం తెలిపింది.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..

ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..

G.O.Ms.No.204 Dated.20.07.2020