ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసి.. విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఇంటర్ ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కాని విద్యార్థులను సైతం పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

Updated on: Aug 26, 2020 | 9:20 AM

AP Government Decision: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసి.. విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఇంటర్ ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కాని విద్యార్థులను సైతం పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 2020లో ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కానివారికి ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 44 వేల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.

అటు కరోనా కారణంగా వాయిదా పడిన విద్యా సంవత్సరాన్ని(2020-21) మొదలుపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు. దానికి తగ్గట్టుగానే పాఠశాల విద్యాశాఖ అకడమిక్ కేలండర్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పాఠశాలలు రీ-ఓపెన్ చేసే రోజే  అకడమిక్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించనున్నారు.

Also Read:

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Loading...
Unable to load recommendations.
Follow Us