వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

|

Aug 25, 2020 | 1:09 AM

గత వారం రోజులుగా ఏపీలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీనితో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!
Follow us on

 Floods Affected Areas In AP: గత వారం రోజులుగా ఏపీలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీనితో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా లంక గ్రామాలు అన్ని కూడా నీట మునిగాయి. అనేక లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు నాటు పడవల్లోనే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద బాధితులకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న బాధితులకు 25 కిలోల బియ్యం, ఆరు రకాల సరకులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా నీట మునిగిన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందించాలని స్పష్టం చేశారు.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..