Village Courts: జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఏపీలో 42 విలేజ్ కోర్టులు..

ఏపీలో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతీ గ్రామ న్యాయలయాల్లో...

Village Courts: జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఏపీలో 42 విలేజ్ కోర్టులు..

Updated on: Feb 27, 2020 | 3:37 PM

Village Courts In AP: ఏపీలో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతీ గ్రామ న్యాయలయాల్లో న్యాయాధికారిగా జూనియర్‌ సివిల్‌ జడ్జి లేదా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఉంటారు. అలాగే సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్, ఆఫీస్‌ సబార్డినేట్‌‌లు కూడా ప్రతీ విలేజ్ కోర్టుకు ఉండనున్నారు. ఇక అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

Also Read: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు.. 

ప్రకాశం జిల్లాలో 8, కర్నూలు 3, నెల్లూరు 3, శ్రీకాకుళంజిల్లాలో 3, విశాఖపట్నంలో 2,కడపలో 2, అనంతపురం 2, పశ్చిమగోదావరి 2, కృష్ణా జిల్లాలో రెండు విలేజ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే చిత్తూరు, విజయనగరం, తూర్పుగోదావరిలో ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అటు జీతాలు, ఇతర ఖర్చుల కింద ఒక్కో గ్రామ న్యాయాలయానికి రూ.27.60 లక్షలు చెల్లించనున్నారు. ఇక ఈ విలేజ్ కోర్టులన్నింటిని గ్రామ న్యాయాలయాల చట్టం 2008 కింద ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: జేఎన్‌టీయూ కీలక నిర్ణయం.. ఇకపై బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి..

Also Read: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!