‘పల్నాటి పులి’ రాజకీయ ప్రస్థానం…

|

Sep 16, 2019 | 1:29 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు(72) మృతి చెందారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉరేసుకున్న ఆయనను హుటాహుటిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించగా.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన్నీ కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న ఉదయమే ఆయన హైదరాబాద్ రాగా.. కుమారుడు శివరాంతో తీవ్ర ఘర్షణ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇకపోతే గుంటూరులోని ఆయన అభిమానులు, […]

పల్నాటి పులి రాజకీయ ప్రస్థానం...
Follow us on
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు(72) మృతి చెందారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉరేసుకున్న ఆయనను హుటాహుటిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించగా.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన్నీ కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న ఉదయమే ఆయన హైదరాబాద్ రాగా.. కుమారుడు శివరాంతో తీవ్ర ఘర్షణ జరిగినట్లు సమాచారం అందుతోంది.
ఇకపోతే గుంటూరులోని ఆయన అభిమానులు, అనుచరులు ఆప్యాయంగా  కోడెలను ‘పల్నాటి పులి’గా పిలుచుకుంటారు. ఆయన ఇకలేరనే విషయం తెలుసుకున్న వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మెడిసిన్  చదువుకున్న కోడెల శివప్రసాదరావు.. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1947 మే2న కండ్లగుంటలో జన్మించిన ఆయన.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో నర్సరావుపేట నుంచి కోడెల తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నర్సరావుపేట అంటే కోడెల అనేలా ఆయన 1983,85,89,94,99 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుసగా గెలిచారు. అంతేకాకుండా 1987-88 మధ్యలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటు 1996-97 మధ్య భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రిగా,  1997-99 మధ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. అటు ఎన్టీఆర్ కేబినెట్‌తో పాటు చంద్రబాబు కేబినెట్‌లో కూడా కోడెల మంత్రిగా వ్యవహరించారు. 2014-19 వరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఇక 2004,2009 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి కోడెల ఓడిపోగా.. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి.. 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు.