నాకు కరోనా పరీక్షలు చేయండి : అచ్చెన్నాయుడు

|

Jul 01, 2020 | 6:47 PM

ఈఎస్ఐ మందుల కొనుగోళ్లల్లో అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జనరల్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ కి లేఖ రాశారు. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని వెంటనే కొవిడ్ పరీక్షలు చేయాలని కోరారు.

నాకు కరోనా పరీక్షలు చేయండి : అచ్చెన్నాయుడు
Follow us on

ఈఎస్ఐ మందుల కొనుగోళ్లల్లో అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు. కాగా, ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో అచ్చెన్నాయుడు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పోందుతున్నారు. మరోవైపు ఆయనను ఈ నెల 25 నుండి 27 వరకు మూడు రోజులు పాటు కస్టడీకి ఎసిబి కోర్టు అనుమతించింది. అయితే, అచ్చెన్నాయుడి ఆరోగ్యపరిస్థితుల రీత్యా ఆయనను చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఎసిబి అధికారులు విచారించారు.

అయితే, తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని వెంటనే కొవిడ్ పరీక్షలు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ కి లేఖ రాశారు. కరోనా పరీక్ష చేయకుండా అధికారులు జైలులోకి అనుమతించరని.. అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే ఢిశ్చార్జ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్న అచ్చెన్న సంబంధించి కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకారావల్సి ఉంది.