AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయాలపై వరుస ఘటనలతో ఏపీ పోలీస్‌ అప్రమత్తం.. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిఘాః డీజీపీ

ఇకనుంచి ఏపీలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా ఉంటుందన్నారు. వాటి రక్షణ కోసం ప్రత్యేకించి పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌కు ఆదేశించారు డీజీపీ.

ఆలయాలపై వరుస ఘటనలతో ఏపీ పోలీస్‌ అప్రమత్తం.. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిఘాః డీజీపీ
Balaraju Goud
|

Updated on: Jan 03, 2021 | 11:17 AM

Share

AP Police Alert: ఇటీవల దేవాలయాలకు సంబంధించి వరుస సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇకనుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా ఉంటుందన్నారు. వాటి రక్షణ కోసం ప్రత్యేకించి పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌కు ఆదేశించినట్లు డీజీపీ చెప్పారు. ఎల్లవేళలా పోలీసుశాఖ అందుబాటులో ఉంటుందన్నారు. దేవాలయాలు ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరిదని, అర్చకులు పూజారులు ఆలయ నిర్వాహకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని తక్షణమే సమీపంలోని పోలీసులకు లేదా డైల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క దేవాలయాన్ని జియో ట్యాగింగ్‌ చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మత సామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ స్పష్టం చేశారు.