AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 349 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసుల సంఖ్య, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి

|

Dec 27, 2020 | 6:06 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 46,386 నమూనాలను పరీక్షించగా..349 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య

AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 349 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసుల సంఖ్య, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 46,386 నమూనాలను పరీక్షించగా..349 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,061కు చేరింది. కోవిడ్ కారణంగా కొత్తగా ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య  7094కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3625 యాక్టీవ్ కేసులున్నాయి. కొత్తగా 422 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,70,342కు చేరింది. నేటి వరకు 1,16,20,503 నమూనాలను పరీక్షించినట్టు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది.

పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.

Also Read : 

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

 మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం