#ap corona updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 43,044 నమూనాలు పరీక్షించగా.. 753 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,54,764కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,507 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,29,991 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17,892. వైరస్ బాధితుల్లో కొత్తగా 13 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,881కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
#COVIDUpdates: 16/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,51,869 పాజిటివ్ కేసు లకు గాను
*8,27,096 మంది డిశ్చార్జ్ కాగా
*6,881 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 17,892#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/m6Q7eisZAM— ArogyaAndhra (@ArogyaAndhra) November 16, 2020
కాగా, కరోనా రాకాసి బారినపడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం
జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం,
విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరి చొప్పున మృత్యువాతపడ్డారని ఆరోగ్య శాఖ
వెల్లడించింది. ఇక, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 91,97,307 శాంపిల్స్
పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.