ప్రస్తుతం ఏపీ రాజధాని అంశం.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. టాలీవుడ్ ప్రముఖులకు లేఖ రాసింది కాంగ్రెస్. మూడు రాజధానులపై స్పందించాలని లేఖలో పేర్కొన్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. సినీ ప్రముఖుల మౌనం రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదన్నారు. హీరోలు రాష్ట్ర రాజధానిపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీ కాంగ్రెస్ నేతలు లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10లోగా సినీ ప్రముఖులు స్పందించకపోతే.. సంక్రాంతి పండుగ 3 రోజులూ థియేటర్ల బంద్‌కు పిలుపునిస్తామని అల్టిమేటం జారీ చేశారు ఏపీ కాంగ్రెస్ నేతలు. కాగా.. ఇప్పటికే గురువారం ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురి హీరోల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వారు ఏపీ రాజధాని అంశంపై స్పందిస్తారో లేదో చూడాలి. కాగా.. అటు అమరావతి ప్రాంత రైతులు కూడా తమ నిరసనను మరింత ఉధృతం చేస్తూ సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు.