ఏపీ సీఎం జగన్ కాసేపట్లో బడి బాట కార్యక్రమాన్ని పాల్గొనబోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జడ్పీ పాఠశాలలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ల వైపు ఆకర్షితులను చేయాలన్న ఉద్దేశంతో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.