అవినీతి ఆరోపణలొస్తే పదవి ఔట్..మంత్రులకు జగన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉద్యోగులు, రైతులపై వరాల జల్లు కురిపించిన ఆయన.. ఆరు గంటల సుదీర్ఘంగా మంత్రులతో పలు విషయాలపై చర్చించారు. అవినీతికి తావు లేకుండా పరిపాలన సాగించాలని కేబినెట్ సమావేశంలో మంత్రులకు సూచించారు జగన్. ఒకవేళ మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే వారిని మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగిస్తానని జగన్ స్పష్టంచేశారు. ఏపీ కేబినెట్ దేశానికి ఆదర్శంగా ఉండాలని, అవినీతికి దూరంగా ఉండాలని, పక్కదారులు […]

అవినీతి ఆరోపణలొస్తే పదవి ఔట్..మంత్రులకు జగన్ వార్నింగ్

Updated on: Jun 10, 2019 | 8:53 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉద్యోగులు, రైతులపై వరాల జల్లు కురిపించిన ఆయన.. ఆరు గంటల సుదీర్ఘంగా మంత్రులతో పలు విషయాలపై చర్చించారు. అవినీతికి తావు లేకుండా పరిపాలన సాగించాలని కేబినెట్ సమావేశంలో మంత్రులకు సూచించారు జగన్.

ఒకవేళ మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే వారిని మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగిస్తానని జగన్ స్పష్టంచేశారు. ఏపీ కేబినెట్ దేశానికి ఆదర్శంగా ఉండాలని, అవినీతికి దూరంగా ఉండాలని, పక్కదారులు పట్టవద్దని అన్నారు. అలాగే గత ప్రభుత్వ హయంలో జరిగిన కుంభకోణాలను వెలికితీసిన అధికారులు, మంత్రులకు సన్మానం చేస్తానని, మంత్రులకు సూచనలు చేశారు.