జగన్ అనే నేను… నవరత్నాలకు శ్రీకారం!

ముఖ్యమంత్రి హోదాలో సొంత గడ్డకు రావడం ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి. జగన్ అనే నేను ఈ జిల్లా ముద్దు బిడ్డగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ అడుగు పెట్టానన్నారు. జమ్మలమడుగులో జరిగిన సభలో పాల్గొన్న జగన్.. వైఎస్‌ఆర్ పింఛన్ కానుక, రైతు దినోత్సవాన్ని ప్రారంభించారు. కడప గడప నుంచి నవరత్నాలకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు జగన్. గతంలో అవ్వా తాతల్ని పింఛన్ ఇస్తున్నారా అని అడిగితే.. ఇచ్చే వారు […]

జగన్ అనే నేను... నవరత్నాలకు శ్రీకారం!

Edited By:

Updated on: Jul 08, 2019 | 6:03 PM

ముఖ్యమంత్రి హోదాలో సొంత గడ్డకు రావడం ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి. జగన్ అనే నేను ఈ జిల్లా ముద్దు బిడ్డగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ అడుగు పెట్టానన్నారు. జమ్మలమడుగులో జరిగిన సభలో పాల్గొన్న జగన్.. వైఎస్‌ఆర్ పింఛన్ కానుక, రైతు దినోత్సవాన్ని ప్రారంభించారు.

కడప గడప నుంచి నవరత్నాలకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు జగన్. గతంలో అవ్వా తాతల్ని పింఛన్ ఇస్తున్నారా అని అడిగితే.. ఇచ్చే వారు కాదని చెప్పేవాళ్లు.. రూ. వెయ్యి మాత్రమే అని చెప్పేవాళ్లన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే.. ఇప్పుడు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల 250 పెంచుతూ శ్రీకారం చుట్టామన్నారు. అవ్వా తాతలకు మనవడిగా మాట నిలబెట్టుకున్నామని.. దివ్యాంగులకు మూడు వేలు.. డయాలసిస్ పేషంట్లకు రూ.10వేలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మళ్లీ ఈ నెలలనే పెండింగ్‌లో ఉన్న 5 లక్షల 40వేల పింఛన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

సెప్టెంబర్ 1 నుంచి అవ్వాతాతలకు పింఛన్‌ను నేరుగా ఇంటికి వచ్చి చేతికి ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు జగన్. ఎవరూ పింఛన్ రాలేదని బాధపడాల్సిన పని లేదని.. ప్రతి 50మందికి వాలంటీర్లు, 2వేల ప్రజలకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

Follow Us