నేటి నుంచే ఏపీలో ‘జగనన్న విద్యాకానుక’ పథకం

|

Oct 08, 2020 | 7:16 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా పునాదిపాడు హైస్కూల్‌లో సీఎం జగన్‌ ఈకార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా హై స్కూల్‌లో నాడు – నేడు పనులను పరిశీలించి.. విద్యార్థులతో ముచ్చటిస్తారు ముఖ్యమంత్రి జగన్. అనంతరం స్టూడెంట్స్‌కి విద్యా కానుక కిట్లను అందజేస్తారు. ఈ కిట్టులో స్కూల్ బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫామ్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ ఉంటాయి. యూనిఫామ్‌ కుట్టుకూలి […]

నేటి నుంచే ఏపీలో జగనన్న విద్యాకానుక పథకం
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా పునాదిపాడు హైస్కూల్‌లో సీఎం జగన్‌ ఈకార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా హై స్కూల్‌లో నాడు – నేడు పనులను పరిశీలించి.. విద్యార్థులతో ముచ్చటిస్తారు ముఖ్యమంత్రి జగన్. అనంతరం స్టూడెంట్స్‌కి విద్యా కానుక కిట్లను అందజేస్తారు. ఈ కిట్టులో స్కూల్ బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫామ్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ ఉంటాయి. యూనిఫామ్‌ కుట్టుకూలి డబ్బులను ప్రభుత్వం విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేయనుంది.