చినజీయర్‌ స్వామిని పరామర్శించిన సీఎం జగన్‌

|

Sep 13, 2020 | 7:55 PM

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. సీఎం స్వయంగా చినజీయర్‌ స్వామికి ఇవాళ ఫోన్‌ చేసి..

చినజీయర్‌ స్వామిని పరామర్శించిన సీఎం జగన్‌
Follow us on

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. సీఎం స్వయంగా చినజీయర్‌ స్వామికి ఇవాళ ఫోన్‌ చేసి ఆయన తల్లి మంగతాయారు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శనివారం చినజీయర్‌ స్వామి మాతృమూర్తి 85 ఏళ్ల మంగతాయారు అస్తమించిన సంగతి తెలిసిందే. అటు, అనేక మంది రాజకీయ, ఆధ్మాత్మిక ప్రముఖులు చినజీయర్ స్వామిని శంషాబాద్ లోని ఆయన ఆశ్రమంలో స్వయంగా కలిసి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మాతృవియోగం
ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.