దేశంలో అత్యంత దగాపడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ : సీఎం జగన్

| Edited By: Pardhasaradhi Peri

Nov 01, 2020 | 10:28 AM

దేశంలో అత్యంత దగా పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేటికీ 33 శాతం మంది నిరక్షరాస్యులు రాష్ట్రంలో ఉండటం రాష్ట్ర వెనుకబాటు తనానికి నిదర్శనమన్నారు. అయితే విద్యా, వైద్య, వ్యవసాయం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ సర్కార్‌ చేపట్టిందని తెలిపారు. ఆవాసం కోసం 32 లక్షల పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వారిపై మండిపడ్డారు జగన్‌. కులాల […]

దేశంలో అత్యంత దగాపడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ : సీఎం జగన్
Follow us on

దేశంలో అత్యంత దగా పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేటికీ 33 శాతం మంది నిరక్షరాస్యులు రాష్ట్రంలో ఉండటం రాష్ట్ర వెనుకబాటు తనానికి నిదర్శనమన్నారు. అయితే విద్యా, వైద్య, వ్యవసాయం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ సర్కార్‌ చేపట్టిందని తెలిపారు. ఆవాసం కోసం 32 లక్షల పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వారిపై మండిపడ్డారు జగన్‌. కులాల కలుపు మొక్కలు రాష్ట్రం పరువు తీస్తున్నాయని మండిపడ్డారు. సమస్యలు.. సవాళ్లు ఉన్నాయని.. అయితే ప్రజా బలంతో ముందుకెళ్తామన్నారు సీఎం జగన్‌. ఆంధ్రరాష్ర్ట అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంత్రులు, వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.