ముంపు ప్రాంతాల్లో సీఎం సర్వే..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. హస్తిన పర్యటనలో ఉన్న సీఎం జగన్ రాష్ట్రానికి బయల్దేరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలు నీటి మునిగిపోయాయి. పోలవరం మండలంలోని దాదాపు 19 గ్రామాలు 10 రోజులుగా పూర్తిగా జలదిగ్భందనంలో చిక్కుకుపోయాయి. అటు ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది.  ఈ క్రమంలోనే సీఎం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ […]

ముంపు ప్రాంతాల్లో సీఎం సర్వే..

Updated on: Aug 08, 2019 | 2:01 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. హస్తిన పర్యటనలో ఉన్న సీఎం జగన్ రాష్ట్రానికి బయల్దేరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలు నీటి మునిగిపోయాయి. పోలవరం మండలంలోని దాదాపు 19 గ్రామాలు 10 రోజులుగా పూర్తిగా జలదిగ్భందనంలో చిక్కుకుపోయాయి. అటు ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది.  ఈ క్రమంలోనే సీఎం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పోలవరం కాపర్ డ్యామ్ ప్రాంతాన్ని జగన్ సందర్శించనున్నారు. వరద ప్రవాహం, సహాయక చర్యలపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.