రింగ్ దాటి లోపలికి వస్తే మార్షల్స్‌చేత పంపించేయండి: సీఎం జగన్

| Edited By:

Jan 22, 2020 | 11:40 AM

ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జై అమరావతి అంటూ టీడీపీ నేతలు.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసనలకు దిగారు. దీంతో ఏపీ సీఎం జగన్ మండిపడి.. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. పోడియం వద్దకి వెళ్లి స్పీకర్‌ని అవమాన పరుస్తున్నారు. ‘పోడియం చుట్టూ ఓ రింగ్ ఏర్పాటు చేయాలని.. ఆ రింగ్ దాటి లోపలకు వస్తే.. మార్షల్స్‌ చేత బయటకు పంపాలని’ సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు […]

రింగ్ దాటి లోపలికి వస్తే మార్షల్స్‌చేత పంపించేయండి: సీఎం జగన్
Follow us on

ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జై అమరావతి అంటూ టీడీపీ నేతలు.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసనలకు దిగారు. దీంతో ఏపీ సీఎం జగన్ మండిపడి.. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. పోడియం వద్దకి వెళ్లి స్పీకర్‌ని అవమాన పరుస్తున్నారు. ‘పోడియం చుట్టూ ఓ రింగ్ ఏర్పాటు చేయాలని.. ఆ రింగ్ దాటి లోపలకు వస్తే.. మార్షల్స్‌ చేత బయటకు పంపాలని’ సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారికి సంస్కారం లేదని.. అదో దిక్కుమాలిన పార్టీ అని వ్యాఖ్యానించారు సీఎం జగన్.

కావాలనే మమ్మల్ని దారుణంగా రెచ్చగొట్టేలా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. సంస్కారం లేని ఇలాంటి వారు.. అసలు వీళ్లు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా తెలీడం లేదు. ప్రజలకు సంబంధించిన వాటిపై చర్చ జరుగుతుంటే.. చేతనైతే సలహాలు ఇవ్వాలి.. అలా చేతకాకపోతే అసెంబ్లీకి రాకుండా బయటే ఉండాలని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ఉన్నది 10 మంది.. కానీ వీధి రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.