ఈ నెల 25న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన జరుగనుంది. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.

ఈ నెల 25న ఏపీ కేబినెట్ భేటీ
AP cabinet

Updated on: Sep 20, 2020 | 1:20 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన జరుగనుంది. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితులు, నవరత్నాల అమలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. కేబినెట్‌ భేటీలో చర్చించాల్సిన ఇతర అంశాలపై అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.