AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ, టీడీపీలకు సోము వీర్రాజు విసిరిన ఆ సవాల్‌పై యూటర్న్‌.. ఆ మాట తానెక్కడా అనలేదన్న ఏపీ బీజేపీ చీఫ్‌

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీలకు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ సంచలనంగా మరింది. అయితే అయన విసిరిన..

వైసీపీ, టీడీపీలకు సోము వీర్రాజు విసిరిన ఆ సవాల్‌పై యూటర్న్‌.. ఆ మాట తానెక్కడా అనలేదన్న ఏపీ బీజేపీ చీఫ్‌
K Sammaiah
|

Updated on: Feb 05, 2021 | 3:32 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీలకు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ సంచలనంగా మరింది. అయితే అయన విసిరిన బీసీ ముఖ్యమంత్రి సవాల్‌పై ఒకరోజు గడవకముందే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు యూటర్న్‌ తీసుకున్నారు. వైసీపీ, టీడీపీకి సవాల్‌ విసిరిన 24 గంటల్లోనే ఆయన వెనక్కి తగ్గారు. సీఎం అభ్యర్థిని తాను ప్రకటించబోనని, అది కేంద్ర పార్టీ నిర్ణయమని చెప్పారు.

బీసీల అంశాన్ని సోము వీర్రాజు ప్రస్తావిస్తూ జగన్‌కు, చంద్రబాబుకు సవాల్‌ చేశారు. బీసీని సీఎంను చేస్తారా… ఆ దమ్ము బీజేపీకే ఉందని ప్రకటించారు. ఏపీలో వారసత్వ రాజకీయాలను తరిమికొట్టాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చెయ్యగలరా అని సవాల్‌ విసిరారు. ఏపీలో ఉన్న ఇద్దరు నేతలు ఒకరు సింగిల్ స్టిక్కర్ అయితే మరొకరు డబల్ స్టిక్కర్ అంటూ చంద్రబాబు, జగన్‌ ను ఉద్దేశించి అన్నారు. రాయలసీమకు చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉండి రాయలసీమను అభివృద్ధి చెయ్యలేకపోయారని విమర్శించారు.

సోము సందించిన విమర్శల మాటేమోగానీ.. బీసీ ముఖ్యమంత్రి అనే అంశంపై ఒకరకంగా రాజకీయ సంచలనంగా మారింది. అయితే పార్టీలో అంతర్గతంగా ఏదైనా చర్చ జరిగిందో? లేదంటే ఇంకెవరి నుంచి అయినా ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ… తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు సోము వీర్రాజు.

అయితే సాధారణంగా… సోము వీర్రాజు ఏదైనా కామెంట్స్‌ చేస్తే దానికి కట్టుబడి ఉంటారు. ఆచితూచి మాట్లాడతారు. కానీ బీసీలను సీఎం చేసే దమ్ము బీజేపీకే ఉందని నిన్న చెప్పిన ఆయన… ఇవాళ ఎందుకు వెనక్కి తగ్గారనేది ఆసక్తిగా మారింది.

Read More:

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్‌.. ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలను అప్పుడే ఆమోదించొద్దని ఎస్ఈసీ ఆదేశం

తెలంగాణలో నిరుద్యోగులకు శక్కర్ వార్త.. రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగ భృతి చేర్చే అవకాశం