నిమ్మగడ్డలో ప్రాణభయం, ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశం పొలిటికల్ ప్రెస్ మీట్‌ని తలపించింది: ఏపీ అసెంబ్లీ స్పీకర్

|

Jan 23, 2021 | 4:46 PM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నాటి మీడియా సమావేశం పొలిటికల్ ప్రెస్ మీట్‌ని తలపిస్తోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్..

నిమ్మగడ్డలో ప్రాణభయం, ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశం పొలిటికల్ ప్రెస్ మీట్‌ని తలపించింది: ఏపీ అసెంబ్లీ స్పీకర్
Follow us on

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నాటి మీడియా సమావేశం పొలిటికల్ ప్రెస్ మీట్‌ని తలపిస్తోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. రాజ్యాంగ బద్దంగా 2018 లో జరగాల్సిన ఈ ఎన్నికలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు ఆలస్యం కావడానికి కారణం ఎవరు..? కరోనా అంటూ పోస్ట్ ఫోన్ చేసింది ఎన్నికల కమిషన్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరి కోసం మీరు కరోనా సెకండ్ వేవ్ ఉన్న తరుణంలో ఎన్నికలు జరుపుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రాణభయంతో ప్రెస్ మీట్ పెట్టారన్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రీన్ జోన్ ఏరియాకు వలస కూలీలు రావడంతో కరోనా జిల్లాకు వలస వచ్చిందని గుర్తు చేశారు. మరల ఈ జిల్లాకు వలస కూలీలు వస్తే, కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని, ఉద్యోగులకు రక్షణ ఎవరు కల్పిస్తారని తమ్మినేని ప్రశ్నించారు.