బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంతిమ్..ది ఫైనల్ ట్రూత్’. మహేష్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయుష్ శర్మ లీడ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో సల్మాన్ తలపాగా కట్టుకొని, గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. సల్మాన్ నయా లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. షర్ట్ లెస్ లుక్ లో ఉన్న ఆయుష్ శర్మ సల్మాన్ తో తలపడటం ఈ వీడియోలో చూపించారు. ఒక రైతు క్రిమినల్ గా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశం పై సినిమా ఉండనుందని తెలుస్తుంది. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు మేకర్స్. ఈ సినిమాతో సల్మాన్ మరో హిట్ సాధించడం ఖాయమని అభిమానులు అంటున్నారు.