తెలంగాణలో 44కు చేరిన కరోనా కేసులు.. ఇద్దరు డాక్టర్లకు కూడా..

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. తెలంగాణలో తాజాగా మరో మూడు కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దోమలగూడకు చెందిన ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది.

తెలంగాణలో 44కు చేరిన కరోనా కేసులు.. ఇద్దరు డాక్టర్లకు కూడా..

Edited By:

Updated on: Mar 26, 2020 | 3:25 PM

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. తెలంగాణలో తాజాగా మరో మూడు కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దోమలగూడకు చెందిన ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. వైరస్‌ సోకిన ఇద్దరు డాక్టర్లు కూడా భార్యాభర్తలు కావడం గమనార్హం. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన మరో వ్యక్తి నమూనాలు పరీక్షించగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 44కు చేరింది.

కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరి డాక్టర్ల పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆ ఇద్దరు డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటన వైద్య సిబ్బందిని షాక్ కి గురి చేసింది. వీరు తమ క్లినిక్ లో ఎంత మందికి వైద్యం చేశారు.. ఎంత మంది ని కలిశారు.. అనే విషయాల పై అధికారులు ఆరా తీస్తున్నారు.