
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకొని, రైతుల సమస్యలను పరిష్కరించకపోతే నిరహార దీక్ష చేపడతానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. ఇటీవల రైతులు చేపట్టిన ఆందోళనలకు ఆయన తన సంఘీభావం తెలిపారు. సీఏసీపీకి స్వయం ప్రతిపత్తి, పండించిన పంటలకు కనీస మద్ధతు ధర కల్పించడం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే తాను నిరహార దీక్ష ప్రారంభిస్తానని అన్నారు. ఈ విషయమై సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఆయన లేఖ రాశారు. వ్యవసాయంకు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని హజారే ఈ లేఖలో తెలిపారు. ఇంతకు ముందు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు.