స్వంత నియోజకవర్గమైన హైదరాబాద్ సనత్‌నగర్‌లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సుడిగాలి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సనత్ నగర్ లోని బస్తీలు, పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్దుల గెలుపుకు కృషి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలిసి పార్టీ అభ్యర్ధిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజక వర్గం పరిధిలోని రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట నియోజక వర్గాల అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ప్రచారాన్ని ఇవాళ్టి నుంచి ఉధృతం చేశారు. రాంగోపాల్‌పేట డివిజన్ అభ్యర్ధి అత్తెల్లి అరుణగౌడ్‌కు మద్దతుగా కళాసిగూడ, జవహర్‌జనతా, బర్తన్‌కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో తలసాని పాదయాత్ర నిర్వహించారు. అమీర్‌పేట డివిజన్ అభ్యర్ధి శేషుకుమారి విజయం కోసం కుమ్మరిబస్తీ తదితర ప్రాంతాల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. గత ఆరేళ్లుగా నగరంలో జరిగిన అభివృద్ధి, పెరిగిన తలసరి ఆదాయాన్ని దృష్టిలోపెట్టుకుని యువత ఓటువేయాలని తలసాని కోరారు.