పోలీసునూ వదలని కోవిడ్… వైరస్ సోకి సీఐ మృతి

కరోనా మహమ్మారి ధాటికి ఫ్రంట్ వారియర్స్ ను సైతం వదలడంలేదు. కొవిడ్ కట్టడిలో భాగంగా విధులు నిర్వహిస్తున్నవారు వైరస్ సోకి అశువులుబాసుతున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ అనంతపురం సీఐ రాజశేఖర్‌ మృతి చెందారు.

పోలీసునూ వదలని కోవిడ్... వైరస్ సోకి సీఐ మృతి

Updated on: Jul 14, 2020 | 9:21 PM

కరోనా మహమ్మారి ధాటికి ఫ్రంట్ వారియర్స్ ను సైతం వదలడంలేదు. కొవిడ్ కట్టడిలో భాగంగా విధులు నిర్వహిస్తున్నవారు వైరస్ సోకి అశువులుబాసుతున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ అనంతపురం సీఐ రాజశేఖర్‌ మృతి చెందారు. ఈనెల 5న ఆయనకు కరోనా నిర్ధారణ కాగా అనంతపురంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సీఐని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో అనంతపురం‌లో 185 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు జిల్లాలో 3,651 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 2, 155 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 1,456 మంది చికిత్సపొందు తున్నారు. మొత్తం 40 మంది చనిపోయారని మంగళవారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.