రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఏపీ నూతన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి(సీఎస్)గా ఆదిత్యనాథ్ దాస్ ఈరోజు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గవర్నర్ ను గౌరవ సూచికంగా భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం 3:15 గంటలకు ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఇప్పటివరకూ సీఎస్ గా సేవలందించింన నీలం సాహ్నికి అధికారులు వీడ్కోలు పలికారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే, పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు.