ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలలో నిత్యం ప్రజలతో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎవరు అంటే మొదటగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేరే గుర్తొస్తుంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజూ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో, కాలనీలో పర్యటిస్తూనే ఉంటారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. కుదిరితే అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపిస్తారు…. లేదంటే అధికారులకు చెప్పి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. ఇలా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ చిన్నా, పెద్ద, ముసలి వాళ్లు అన్న తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజలతో మాత్రం ఎంతో సరదాగా ఉంటారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటిస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు ఆయనలోని చమత్కారాన్ని తెలియజేస్తాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన చమత్కారాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాగున్నావా పెద్దమ్మ.. బాగున్నావా పెద్దాయన… బాగున్నావా అక్క… ఏరా చిన్నా…. ఏం హీరోస్ అని పలకరింపులతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ప్రధానంగా నియోజకవర్గ సమస్యల తోపాటు ఫన్నీ ఇన్సిడెంట్లు చాలానే జరిగాయి. ముదిగుబ్బ టౌన్ లో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఒక ఎనిమిదో తరగతి పిల్లవాడు తన సమస్య చెప్పుకున్నాడు. అది ఏంటంటే ఆడుకోవడానికి వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ ఇవ్వడం లేదంటూ చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూసాయి.
ఓ ప్రభుత్వ పాఠశాలకు విజిట్ చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఎవరికి తెలుసు అని పిల్లల్ని అడిగారు. అందులో పిల్లవాడు చేయెత్తి ఝాన్సీ లక్ష్మీబాయి పాటలు బాగా పడుతుందని… ఆ తర్వాత డ్యాన్స్ చేస్తుందని చెప్పాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అండర్ 15 క్రికెట్ పోటీల్లో కప్పు గెలిచిన విద్యార్థులను ఎమ్మెల్యే కేతిరెడ్డి కలిశారు. క్రికెట్ ఆటలో ఎవరెవరు ఏం చేస్తారు అని అడగడంతో… ఒకరు నేను బ్యాట్స్ మెన్ అని… మరొకరు బౌలర్ అని… ఇంకొకరు ఆల్ రౌండర్ అని చెప్పారు. ఓ కుర్రోడు మాత్రం ఫిల్టర్ ని అని చెప్పడంతో… క్రికెట్ ఆటలో అందరూ ఫీల్డింగ్ చేయాలి నువ్వు ఫీల్డింగ్ లో ఎక్స్ పర్ట్ వా అంటూ అందర్నీ నవ్వించారు.
పక్క ఊరు నుంచి పూలు అమ్ముకోవడానికి వచ్చిన ఓ మహిళను పలకరించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి… అంత దూరం నుంచి వస్తే 200 మిగులుతుందా అని ఆమెపై జాలి చూపించి ఏకంగా 2000 రూపాయలకు కొని ఆ పూలు మొత్తం ఆంజనేయస్వామి గుడిలో ఇచ్చి వెళ్ళమని ఆమెకు డబ్బులు ఇచ్చాడు…. అదేవిధంగా ఓ స్కూలు ముందు పిల్లల తినుబండారాలు అమ్మే తోపుడు బండి కనిపించడంతో ఆమెను కూడా పలకరించిన కేతిరెడ్డి… అందులో ఉన్న తినుబండారాలన్నీ ఎంత అవుతాయని అడిగి… ఆ బండి మొత్తానికి గాను పదివేల రూపాయలు ఆవిడకి ఇచ్చి సాయంత్రం వచ్చి తోపుడు బండి తీసుకెళ్లమని… బండిని తీసుకుని స్కూల్లో పిల్లలందరికీ ఆ తిను బండారాలను పంచిపెట్టారు…
ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో జరిగిన ఫన్నీ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో మాత్రం చాలా సరదాగా నియోజకవర్గ ప్రజలతో గడుపుతారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. కష్టాల్లో ఉన్న వారికి డబ్బులు ఇచ్చి సాయం చేస్తుంటారు. అదేవిధంగా చిన్నపిల్లలతో చమత్కారాలు, సరదాగా నవ్వించడానికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఓ భాగం అయిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం