ఉగ్రమూకలతో పోరాడి వీరమరణం పొందిన ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్

జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకలతో ప్రాణాలకు తెగించి పోరాడి వీరమరణం చెందిన నలుగురిలో తెలంగాణకు చెందిన మహేశ్ ఒకరుగా, ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం, రెడ్డి వారి పల్లి కి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వయసు 37 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మీలో హవల్దార్ గా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి. 18 ఏళ్ల క్రితం ఇండియన్ ఆర్మీలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కి […]

ఉగ్రమూకలతో పోరాడి వీరమరణం పొందిన ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్

Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 09, 2020 | 11:51 AM

జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకలతో ప్రాణాలకు తెగించి పోరాడి వీరమరణం చెందిన నలుగురిలో తెలంగాణకు చెందిన మహేశ్ ఒకరుగా, ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం, రెడ్డి వారి పల్లి కి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వయసు 37 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మీలో హవల్దార్ గా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి. 18 ఏళ్ల క్రితం ఇండియన్ ఆర్మీలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.. ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సరిలేరు మీకెవ్వరు .. అమరజవాన్లకు టీవీ9 ఘన నివాళి