ఆంధ్రాలో మద్య నియంత్రణకు కొత్త ఫ్లాన్..!

|

May 29, 2020 | 9:43 PM

మద్య నిషేధం వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగు వేస్తోంది. ఇప్పటికే మద్యం ధరలు పెంచి సామాన్యులకు అందనంత చేసిన సర్కార్ తాజాగా.. మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో మార్పు తీసుకువచ్చే ఫ్లాన్ చేసింది. మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా డిజిటల్ విధానంలో శుక్రవారం ఈ కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. దశలవారిగా మద్య నిషేదం అమలుకు సిఎం […]

ఆంధ్రాలో మద్య నియంత్రణకు కొత్త ఫ్లాన్..!
Follow us on

మద్య నిషేధం వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగు వేస్తోంది. ఇప్పటికే మద్యం ధరలు పెంచి సామాన్యులకు అందనంత చేసిన సర్కార్ తాజాగా.. మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో మార్పు తీసుకువచ్చే ఫ్లాన్ చేసింది. మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా డిజిటల్ విధానంలో శుక్రవారం ఈ కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. దశలవారిగా మద్య నిషేదం అమలుకు సిఎం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాదకద్రవ్యాల వినియోగ తగ్గింపులో భాగంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో విభిన్న ప్రతిభావంతులు, లింగమార్పిడి, వయోవృద్దుల విభాగం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా 15 ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటి నిర్వహణ కోసం సంవత్సరానికి 4.98 కోట్లు వ్యయం చేయనున్నామని ప్రభుత్వ కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.