టీడీపీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్సీల పిటిషన్‌పై విచారణ

పార్టీ విప్‌ ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతల అనర్హత పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదుపై మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ విచారణ చేపట్టారు.

టీడీపీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్సీల పిటిషన్‌పై విచారణ
Follow us

|

Updated on: Jun 03, 2020 | 7:56 PM

పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్సీలపై విచారణ చేపట్టారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్. పార్టీ విప్‌ ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతల అనర్హత పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదుపై మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ విచారణ చేపట్టారు. జనవరిలో జరిగిన శాసనమండలి సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు సంబంధించి టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్సీలు అందరికీ విప్‌ జారీ చేసింది. రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై జరిగిన ఓటింగ్‌లో ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతలు పార్టీ విప్‌ను ఉల్లంఘించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్‌బాబు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలన్న ఛైర్మన్‌ ఆదేశాల మేరకు బుద్ధా వెంకన్న, అశోక్‌బాబు తమ వాదనలు వినిపించారు. అయితే, కొన్ని కారణాల రీత్యా విచారణకు హాజరు కాలేకపోతున్నామని పోతుల సునీత, శివనాథ రెడ్డిలు ఛైర్మన్‌కు సమాచారమిచ్చారు. ఇద్దరు ఎమ్మెల్సీలు సాకులు చెప్పి విచారణకు హాజరుకాలేదని.. వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌ని కోరారు. ఈ అంశంపై శాసనమండలి ఛైర్మన్ షరీఫ్.. విప్ ధిక్కరించిన ఎమ్మెల్సీలకు మరో అవకాశం ఇస్తారా..? తుది నిర్ణయం తీసుకుంటారా? తేలాల్సి ఉంది

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో