రాష్ట్రాన్ని.. రావణకాష్ఠం చేశారు- చంద్రబాబు

|

Apr 13, 2019 | 4:01 PM

ఢిల్లీ: ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో సీఈసీ సునీల్‌ అరోరాతో సమావేశమై ఏపీలో ఎన్నికల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో ఈసీ జోక్యం చేసుకుందని, ప్రభుత్వ అధికారాలను అణచివేశారని సీఎం దుయ్యబట్టారు. ఏ కారణం లేకుండా అధికారులను బదిలీ చేశారని, టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్నారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి […]

రాష్ట్రాన్ని.. రావణకాష్ఠం చేశారు- చంద్రబాబు
Follow us on

ఢిల్లీ: ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో సీఈసీ సునీల్‌ అరోరాతో సమావేశమై ఏపీలో ఎన్నికల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో ఈసీ జోక్యం చేసుకుందని, ప్రభుత్వ అధికారాలను అణచివేశారని సీఎం దుయ్యబట్టారు. ఏ కారణం లేకుండా అధికారులను బదిలీ చేశారని, టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్నారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పించుకోవడానికి ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబుతో సహా 15 మంది టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంలలో తలెత్తిన లోపాలు తదితర అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..అభ్యర్థులు, స్పీకర్‌పై దాడులు చేశారని, ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ప్రజలు కంకణం కట్టుకున్నారని, ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలతో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిందని, ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే స్పందించలేదని మండిపడ్దారు. ఈ రోజు, రేపు ఢిల్లీలోనే ఉంటానని, ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తానని చంద్రబాబు తెలిపారు.