గత కొద్ది రోజులుగా.. బుల్లితెర యాంకర్ ప్రదీప్ హెల్త్‌పై రకరకాల వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా.. యాంకర్ ప్రదీప్ స్పందించాడు. తన అనారోగ్యంపై అసలు విషయం బయటపెట్టాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌లో వచ్చిన ప్రదీప్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన ఆరోగ్యంపై స్పందిస్తోన్న ఫ్యాన్స్‌కు చాలా థ్యాంక్యూ సో మచ్ అని.. కానీ.. తను అనారోగ్యానికి గురి కాలేదని.. బాగానే ఉన్నానని వీడియోలో చెప్పాడు.
కానీ.. ‘సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ చూస్తుంటే.. చాలా టైం పాస్ అయిందని.. చాలా నవ్వుకున్నట్టు ప్రదీప్ తెలిపాడు. సినిమా షూటింగ్‌లో భాగంగా.. కాలు బెణికిందని .. అయినా.. నేను లెక్కచేయకుండా.. వర్క్ చేస్తూ వచ్చాను. కానీ.. కాలు నొప్పి ఎక్కువగా రావడంతో.. డాక్టర్లు సీరియస్‌గా రెస్ట్ తీసుకోమని.. చెప్పారని.. అందుకే ఒక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పాడు. కానీ.. నేను ఇంట్లో ఉండటం మా అమ్మ, నాన్నలకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. చాలా రోజుల తర్వాత నేను ఇంట్లో ఉన్నాను. దివాళితో పాటు నా బర్త్ డే కూడా చాలా గ్రాండ్‌గా ఇంట్లో అమ్మానాన్నలతో చేసుకున్నానని.. కానీ త్వరలోనే.. మరిన్ని షోలతో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి వస్తానని తెలిపారు ప్రదీప్.