అది భలే బైక్ సౌండ్.. అదిరిందయ్యా కుర్రోడి డ్యాన్స్..

| Edited By:

Aug 10, 2019 | 4:31 PM

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా వుంటారు. నవ్వించే వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన ఒక ఫన్నీ వీడియోను ‌షేర్ చేశారు. ఇది చూసిన నెటిజెన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత తాను చూసిన కూలెస్ట్ వీడియో అని ఆయన అన్నారు. అయితే దాన్ని చూసిన ప్రతిసారి తాను నవ్వుకుంటూ ఉంటానని చెప్పారు. నా వీకెండ్ ఇలా ప్రారంభమైంది అంటూ.. తన ట్విట్టర్ ఖాతాలో ఒక […]

అది భలే బైక్ సౌండ్.. అదిరిందయ్యా కుర్రోడి డ్యాన్స్..
Follow us on

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా వుంటారు. నవ్వించే వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన ఒక ఫన్నీ వీడియోను ‌షేర్ చేశారు. ఇది చూసిన నెటిజెన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత తాను చూసిన కూలెస్ట్ వీడియో అని ఆయన అన్నారు. అయితే దాన్ని చూసిన ప్రతిసారి తాను నవ్వుకుంటూ ఉంటానని చెప్పారు. నా వీకెండ్ ఇలా ప్రారంభమైంది అంటూ.. తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశారు.

ఈ వీడియోలో ఓ చిన్నారి బయటి నుంచి వస్తూ.. పక్కనే పార్క్ చేసి ఉన్న బైక్ ‌ని కాలితో టచ్ చేస్తాడు. వెంటనే దాని నుంచి సౌండ్ రాగానే.. అది విన్న పిల్లాడు చేతిలో ఉన్న సరుకుల్ని కింద పెట్టి.. డ్యాన్స్ చేస్తాడు. ఆ సౌండ్‌కు అనుగుణంగా మార్చి మార్చి స్టెప్పులు వేస్తాడు. అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.