Hyderabad: ట్రాఫిక్ జామ్‌లో చిక్కున్న అంబులెన్స్ .. దారి ఇవ్వడానికి ప్రోటోకాల్ అడ్డంటూ పోలీసు వాదన

Ambulance Stuck in Jam: ప్రభుత్వమైనా , అధికారులైనా ప్రజల కోసం పనిచేయాలి.. ప్రజల ధన,మాన ప్రాణాల రక్షణకు అండగా నిలబడాలి. ప్రజల కష్ట, నష్టాల్లో ఆదుకుంటూ మానవత్వం తో..

Hyderabad: ట్రాఫిక్ జామ్‌లో చిక్కున్న అంబులెన్స్ .. దారి ఇవ్వడానికి ప్రోటోకాల్ అడ్డంటూ పోలీసు వాదన
Hyderaabad Ambulance

Updated on: Jul 24, 2021 | 5:20 PM

Ambulance Stuck in Jam: ప్రభుత్వమైనా , అధికారులైనా ప్రజల కోసం పనిచేయాలి.. ప్రజల ధన,మాన ప్రాణాల రక్షణకు అండగా నిలబడాలి. ప్రజల కష్ట, నష్టాల్లో ఆదుకుంటూ మానవత్వం తో పనిచేసే అధికారులున్నారు.. వారిగురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే కొంతమంది పోలీసు ప్రోటోకాల్ పేరుతో ప్రాణాపాయ స్థితిలో రోగిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకున్నారు. తమకు ప్రోటోకాల్ ముఖ్యమని చెప్పఁడంతో ప్రస్తుతం పోలీసుల తీరు పై సర్వత్రా నిరసన వ్యక్తం మవుతుంది ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మసబ్ ట్యాంక్ వద్ద ప్రాణ పాయ స్థితిలో ఉన్న రోగిని అంబులెన్స్ ఆస్పత్రికి తరలిస్తోంది. అదే సమయంలో హోమ్ మినిస్టర్ అటువైపుగా వెళ్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ జామ్ ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది. సమయానికి రోగికి చికిత్స అందించక పొతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని భావించిన అంబులెన్స్ లోని వైద్య సిబ్బంది.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విధులను నిర్వహిస్తున్న ట్రఫిక్స్ సిబ్బందిని దారి ఇవ్వమని బతిమిలాడారు. అయినప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది మనసు కరగలేదు.. మానవత్వం మాట మరచిపోయారు. దారి ఇవ్వాల్సిందిగా అంబులెన్స్ దిగి వచ్చి విధి నిర్వహణ లో పోలీసులను బతిమిలాడి న వైద్యులకు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.  ప్రోటో కాల్ అంటూ.. అంబులెన్స్ సైరెన్ ని కూడా ఆపమని ట్రాఫిక్ సిబ్బంది చెప్పడంతో ట్రాఫిక్ పోలీసులు ఓవర్ యాక్షన్ పై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.  ట్రాఫిక్ పోలీసుల తీరుపై అక్కడనున్న వాహనదారులు మండిపడుతున్నారు. ప్రజల కోసమే అధికారులు కానీ.. ప్రోటోకాల్ అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు లేదని అంటున్నారు.

Also Read: Kashi Vishwanath: కాశీ విశ్వనాథుడికి 1700చదరపు గజాల స్థలం ఇచ్చిన ముస్లిం పెద్దలు.. భూ వివాదానికి తెర..