స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బి

|

Jul 28, 2020 | 4:30 PM

వీరు ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన నాటి నుంచి.. ఆయన త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా బిగ్ బి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పూజలు...

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బి
Follow us on

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరు ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన నాటి నుంచి.. ఆయన త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా బిగ్ బి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అమితాబ్ కూడా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే కోవిడ్ 19తో అమితాబ్ చ‌నిపోవాల‌ని కొంద‌రు ట్విట్ట‌ర్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఈ విష‌యం బిగ్ బి దృష్టికి రావ‌డంతో ఆయ‌న త‌న బ్లాగ్ లో తనదైన తరహాలో ఘాటుగా రిప్లై ఇచ్చారు.

‘మిస్ట‌ర్ అజ్ఞాత వ్య‌క్తి.. మీరు మీ తండ్రి పేరు రాయ‌లేదు. ఎందుకంటే మీ తండ్రి ఎవ‌రో మీకే తెలియ‌దు. నేనొక‌టి చెబుతున్నా. ఏవైన రెండు విష‌యాలు జ‌ర‌గొచ్చు. నేను చ‌నిపోతాను లేదా బ్ర‌తుకుతాను. నేనొక వేళ చ‌నిపోతే సెల‌బ్రిటీపై దూష‌ణ‌కి దిగ‌లేరు. ఒక‌వేళ దేవుడి ద‌య వ‌ల‌న నేను బ్ర‌తికి ఉంటే నా నుండి మాత్ర‌మే కాకుండా 90 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ నుండి చాలా ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తుంది. ఒకానొక రోజు దీని వ‌ల‌న నువ్వే ప‌శ్చాతాపం చెందుతావు’. అని బిగ్ బి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.