రెస్టారెంట్ కస్టమర్లకు ఉచితంగా జిప్ మాస్కులు

|

Oct 19, 2020 | 6:59 PM

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా మూసివేసిన హాటల్స్‌, రెస్టారెంట్స్ అన్‌లాక్‌లో భాగంగా క్రమంగా తెరుచుకుంటున్నాయి.

రెస్టారెంట్ కస్టమర్లకు ఉచితంగా జిప్ మాస్కులు
Follow us on

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా మూసివేసిన హాటల్స్‌, రెస్టారెంట్స్ అన్‌లాక్‌లో భాగంగా క్రమంగా తెరుచుకుంటున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న తరుణంలో వినియోగదారులకు రక్షణతోపాటు వారిని ఆకట్టుకునేందుకు కొన్ని రెస్టారెంట్లు వినూత్న ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌ కోల్‌కొతాలోని 2డీ థీమ్ రెస్టారెంట్‌ తమ కస్టమర్లకు జిప్‌ మాస్కులను ఉచితంగా అందిస్తోంది. దీంతో ఏదైనా తిన్నప్పుడు, తాగినప్పుడు ఆ మాస్కుకు ఉన్న జిప్‌ ఓపెన్‌ చేసుకుంటే సరి. అనంతరం జిప్‌ మూసివేసి మాట్లాడుకునేందుకు వీలుంటుంది.

కొవిడ్ మహమ్మారి ముప్పును దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు ముసుగులు ఉచితంగా ఇస్తున్నామని 2D థీమ్ రెస్టారెంట్ యజమాని సోమోశ్రీ సేన్‌గుప్తా వోకీస్ తెలిపారు. ఇది ఒక జిప్పర్‌ను కలిగి ఉంటుంది. ఇది వారు అవసరానికి అనుగుణంగా జిప్ ఉపయోగించడం ద్వారా అహారం తీసుకుంటారని సెన్‌గుప్తా చెప్పారు. ముసుగులు ఉచితంగా ఇచ్చినప్పటికీ, వాటిని ధరించాలా వద్దా అని వినియోగదారుల అభిష్టానికి వదిలేస్తున్నామని ఆమె అన్నారు.