F3 movie update : ‘ఎఫ్3’ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ డిజిటల్ సంస్థ

|

Jan 12, 2021 | 7:38 PM

అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019సంక్రాంతి కానుకగా ఎఫ్ 2 సినిమాను రిలీజ్ చేసాడు..

F3 movie update : ఎఫ్3 స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ డిజిటల్ సంస్థ
Follow us on

f3 movie update : అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019సంక్రాంతి కానుకగా ఎఫ్ 2 సినిమాను రిలీజ్ చేసాడు అనీల్ సంక్రాంతి సాలిడ్ హిట్ ను అందుకున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు అనీల్. ఇక ‘ఎఫ్ 3’ కోసం ఇప్పటికే వెంకటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యారని తెలుస్తుంది. త్వరలో వరుణ్ తేజ్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కి ఫైనాన్స్ ని జత చేసి మోర్ ఫన్ క్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ఎఫ్ 3’ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని తెలుస్తుంది. ఈ సినిమా అన్ని భాషల రైట్స్ రికార్డు స్థాయి ధరకే అమ్ముడు పోయాయని టాక్ ఫిలిం నగర్లో నడుస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బొమన్ ఇరానీ – సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.