రాజధాని రైతుల సంచలన నిర్ణయం..రేపటి నుంచి ‘సకల జనుల సమ్మె’

| Edited By: Pardhasaradhi Peri

Jan 02, 2020 | 6:58 PM

అమరావతి రైతులు ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న నిరసనలు 16వ రోజుకి చేరుకున్నాయి. దీంతో ఉద్యమ తీవ్రతను పెంచేందుకు నిర్ణయించుకున్న రైతులు..జనవరి 3 నుంచి సకలజనుల సమ్మెకు సిద్దమవుతున్నారు. నిత్యావసరాలు, మెడికల్ ఎమర్జెన్సీ వంటి అత్యవవసరాలు మినహా మిగిలిన కార్యాలయాలన్నింటిని మూసివేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అమరావతి చుట్టపక్కల ఉన్న 29 గ్రామాల్లో సకలజనుల సమ్మె ప్రభావం ఉండనుంది. కాగా రాజధానిపై ఇప్పటికే జీఎన్‌ […]

రాజధాని రైతుల సంచలన నిర్ణయం..రేపటి నుంచి సకల జనుల సమ్మె
Follow us on

అమరావతి రైతులు ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న నిరసనలు 16వ రోజుకి చేరుకున్నాయి. దీంతో ఉద్యమ తీవ్రతను పెంచేందుకు నిర్ణయించుకున్న రైతులు..జనవరి 3 నుంచి సకలజనుల సమ్మెకు సిద్దమవుతున్నారు. నిత్యావసరాలు, మెడికల్ ఎమర్జెన్సీ వంటి అత్యవవసరాలు మినహా మిగిలిన కార్యాలయాలన్నింటిని మూసివేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అమరావతి చుట్టపక్కల ఉన్న 29 గ్రామాల్లో సకలజనుల సమ్మె ప్రభావం ఉండనుంది. కాగా రాజధానిపై ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. శుక్రవారం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తమ నివేదికను సీఎం జగన్‌ను ఇవ్వబోతోంది. బీసీజీ రిపోర్ట్ కూడా మూడు రాజధానులవైపే మొగ్గు చూపనుందంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు   ఇటీవలే రాజధాని, ఏపీ సమాగ్రాభివృద్దిపై హైపవర్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ కమిటీ నివేదిక మరో 15 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నింటిని సమీక్షించిన అనంతరం రాజధానిపై తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.