ఏపీలో రెచ్చిపోతున్న దొంగలు, అమలాపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో భారీ చోరీ!

|

Nov 29, 2020 | 7:43 AM

ఏపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా  తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని పేరమ్మ అగ్రహారంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను కొల్లగొట్టారు.

ఏపీలో రెచ్చిపోతున్న దొంగలు, అమలాపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో భారీ చోరీ!
Follow us on

ఏపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా  తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని పేరమ్మ అగ్రహారంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను కొల్లగొట్టారు. రెండ్రోజుల క్రితం ఏటీఎంలో రూ.23 లక్షలు నగదు ఉంచినట్లు అధికారులు చెప్తున్నారరు. దుండగులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎంని కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. అమలాపురం సీఐ బాజీలాల్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎంత డబ్బు చోరీ జరిగిందో పరిశీలించాల్సి ఉందని తెలిపారు.

ఇక  గుంటూరు జిల్లాలో నడికుడి ఎస్బీఐ బ్రాంచ్‌‌లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఈ దోపిడీ కేసును  72 గంటల్లోనే ఛేదించారు. ఈ నెల 20వ తేదీ రాత్రి బిల్డింగ్ వెనక ఉన్న గ్రిల్స్‌ని గ్యాస్‌ కట్టర్‌తో కట్ చేసి లోపలికి బ్యాంకులోకి చొరబడ్డారు దొంగలు.  మొత్తం రూ. 85 లక్షలు కొట్టేశారు. సీసీ కెమెరాలు ఆపేసి మరి తంతు ముగించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీస్ బాస్ లు..స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. బ్యాంకుకు దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో నిందితుల కదలికలకు సంబంధించిన విజువల్స్ కనిపించాయి. వాటి ఆధారంగా విచారణ చేపట్టి దొంగలను పట్టుకున్నారు. నిందితులను మిర్యాలగూడకి చెందిన మిర్యాలగూడ ఎస్టీ కాలనీకి చెందిన పాతనేరస్తులే అని.. వారిద్దరూ వరసకు బాబాయ్, అబ్బాయ్‌గా గుర్తించారు.