కరోనా పేషెంట్ మరణించినట్లు ప్రకటించిన డాక్టర్.. నేను బతికే ఉన్నానంటూ వీడియో పోస్ట్ చేసిన పేషెంట్..

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు అతలాకుతలమయ్యాయి. మధ్య ప్రదేశ్‌లో కోవిడ్-19 రోగుల మరణాలను ప్రకటించడంలో అయోమయం కనిపిస్తోంది.

కరోనా పేషెంట్ మరణించినట్లు ప్రకటించిన డాక్టర్.. నేను బతికే ఉన్నానంటూ వీడియో పోస్ట్ చేసిన పేషెంట్..

Edited By:

Updated on: Apr 26, 2020 | 5:28 PM

Madhya Pradesh Corona Patient: కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు అతలాకుతలమయ్యాయి. మధ్య ప్రదేశ్‌లో కోవిడ్-19 రోగుల మరణాలను ప్రకటించడంలో అయోమయం కనిపిస్తోంది. ఒకరికి బదులు వేరొకరు మరణించినట్లుగా ప్రకటించి విమర్శలపాలవుతోంది. తాను చనిపోయినట్లు వార్తా పత్రికలో చూసుకున్న ఓ వ్యక్తికి నోట మాట రాలేదు. కాస్త తేరుకున్న తర్వాత ఓ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘నేను బతికే ఉన్నాను’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను అందరికీ షేర్ చేయాలని ఆయన కోరారు.

వివరాల్లోకెళితే.. ఉజ్జయినిలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ళ వ్యక్తి చేరారు. ఆయన విడుదల చేసిన వీడియోలో, ‘‘నేను ఆర్‌డీ గర్డి ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం చేరాను. నేను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని శనివారం నేను ఓ వార్తా పత్రికలో చదివాను. కానీ నేను బతికే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఏమీ జరగలేదు. దయచేసి ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. ఇక్కడి ఏర్పాట్లను మెరుగుపరచండి’’ అని తెలిపారు.

కాగా.. ఈ పొరపాటును మధ్య ప్రదేశ్ ఆరోగ్య శాఖ అంగీకరించింది. ఈ తప్పు చేసిన వైద్యునికి షోకాజ్ నోటీసు పంపించింది. ఉజ్జయిని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనసూయ గవాలి సిన్హా మాట్లాడుతూ ఉజ్జయినికి చెందిన కోవిడ్-19 రోగి గురువారం మరణించారని, ఆయన వయసు 60 ఏళ్ళు అని, ఆయన పేరుకు బదులుగా వేరొకరి పేరును నమోదు చేశారని చెప్పారు. నోడల్ ఆఫీసర్ కూడా అయిన డాక్టర్ ఈ పొరపాటుకు బాధ్యత తనదేనని అంగీకరించారని తెలిపారు. ఆ డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు.

Also Read: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. వచ్చే నెలలో..