అదిరే రేంజ్‌లో ‘ఆహా’ వారి దీపావళి సంబరాలు, ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

|

Nov 13, 2020 | 10:17 PM

'ఆహా', 'ఆహా', 'ఆహా'...అచ్చ తెలుగు డిజిటల్ యాప్ 'ఆహా' వీక్షకులకు దీపావళి జోస్ తీసుకువచ్చింది. హైదారాబాద్‌లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి దివాళి బోనాంజా అనౌన్స్ చేస్తోంది.

అదిరే రేంజ్‌లో ఆహా వారి దీపావళి సంబరాలు, ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
Follow us on

‘ఆహా’, ‘ఆహా’, ‘ఆహా’…అచ్చ తెలుగు డిజిటల్ యాప్ ‘ఆహా’ వీక్షకులకు దీపావళి జోస్ తీసుకువచ్చింది. హైదారాబాద్‌లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి దివాళి బోనాంజా అనౌన్స్ చేస్తోంది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతోన్న ఈ వేడుక ప్రస్తుతం జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరుగుతోంది. లాక్‌డౌన్ తర్వాత ఇదే ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఈవెంట్ అవ్వడం విశేషం. ఈ కార్యక్రమానికి హీరో నవదీప్, నటుడు వైవా హర్ష వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ తమదైన పంచ్‌లతో అక్కడికి వచ్చినవారిని అలరిస్తున్నారు. అన్ని కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, నందిని రెడ్డి, దిల్ రాజుతో పాటు పలువురు సెలబ్రిటీలు  అక్కడికి చేరుకున్నారు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ‘ఆహా’ కేరాఫ్‌గా మారిన విషయం తెలిసిందే. 100 శాతం తెలుగు కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన ఫన్ అందిస్తోంది. సరికొత్త షోస్, వెబ్ సిరీస్, మూవీస్ అనౌన్సిమెంట్స్‌తో దూసుకుపోతోంది.

లైవ్ ఈవెంట్ కోసం దిగువ వీడియో చూడండి :