పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై నటి ఫిర్యాదు!

Allegations On Bigg Boss Contestant: తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ స్టార్ హీరో కమల్‌హాసన్ దీనికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన మూడో సీజన్‌కు ప్రముఖ సింగర్ ముగెన్ రావు విన్నర్ కాగా.. శాండీ రన్నరప్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ తర్షన్‌పై నటి సనమ్ శెట్టి క్రిమినల్ కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. […]

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై నటి ఫిర్యాదు!

Edited By:

Updated on: Feb 02, 2020 | 2:58 PM

Allegations On Bigg Boss Contestant: తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ స్టార్ హీరో కమల్‌హాసన్ దీనికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన మూడో సీజన్‌కు ప్రముఖ సింగర్ ముగెన్ రావు విన్నర్ కాగా.. శాండీ రన్నరప్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ తర్షన్‌పై నటి సనమ్ శెట్టి క్రిమినల్ కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె తనపై ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై మీడియా సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించింది.

చుట్టాలు, స్నేహితుల మధ్య మే 12 2019న తర్షన్ తనతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని తెలిపింది. జూన్ 10న వివాహం జరగాల్సి ఉండగా.. బిగ్ బాస్ నుంచి అవకాశం రావడంతో అది కాస్తా వాయిదా పడింది. అంతేకాకుండా ఇద్దరి పెళ్లి విషయాన్ని బహిర్గతం చేయకూడదని తర్షన్ తన దగ్గర మాట తీసుకున్నాడని సనమ్ స్పష్టం చేసింది.

అయితే ఇప్పుడు హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ముఖం చాటేస్తూ.. తనని దూరం పెడుతున్నాడని ఆమె వాపోయింది. పెళ్లి చేసుకుందామని అడుగుతున్నా కూడా ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటున్నాడని చెప్పింది. ఇక ఈ విషయంపై అతడి తల్లిదండ్రులను కలిసినా.. వాళ్ళ దగ్గర నుంచి సరైన స్పందన లేదని చెబుతోంది. తర్షన్ వల్ల తాను మానసికంగా వేధింపులకు గురయ్యానని.. అంతేకాకుండా చాలాసార్లు తనను బెదిరించాడని ఆమె చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తర్షన్ కష్టాల్లో ఉన్నప్పుడు సుమారు 15 లక్షల వరకు ఇచ్చి ఆర్ధికంగా సాయం చేశానని.. తనని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నానని.. అంతేకాక నిశ్చితార్ధం ఖర్చులు కూడా తానే పెట్టుకున్నట్లు నటి సనమ్ శెట్టి ఫిర్యాదులో పేర్కొంది.