Health News: కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, ఆ తర్వాత ఆల్కహాల్ తీసుకోవచ్చా.. నిపుణులు ఏం సూచిస్తున్నారు ?

|

Jan 05, 2021 | 4:09 PM

గత సంవత్సరకాలంగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‏కు వ్యాక్సిన్ వచ్చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ రావడం అందిరికి సంతోషపెట్టే వార్త అయినా.. మందు తాగేవారికి నిరాశే అని చెప్పుకోవచ్చు.

Health News: కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, ఆ తర్వాత ఆల్కహాల్ తీసుకోవచ్చా.. నిపుణులు ఏం సూచిస్తున్నారు ?
Follow us on

గత సంవత్సరకాలంగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‏కు వ్యాక్సిన్ వచ్చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ రావడం అందిరికి సంతోషపెట్టే వార్త అయినా.. మందు తాగేవారికి నిరాశే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుగానీ.. లేదా ఆ తర్వాత కానీ మద్యం తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ మాంచెస్టర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షీనా క్రూక్‏శాంక్ ఈ విషయాలను వెల్లడించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లింపోసైట్ కణాలు పడిపోవడం వలన వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోతుందని తెలిపారు. కొవిడ్ టీకా తీసుకోవడానికి ముందు ప్రజలు ఆల్కహాల్‏కు దూరంగా ఉండాలని చెప్పారు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ టీకాకు అనుకులంగా స్పందించి.. సరిగా పనిచేయాలంటే.. ప్రజలు ఆల్కహాల్‏ తీసుకోకుడదని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునే ముందు రోజు రాత్రి మద్యం సేవించకూడాదని.. అలాగే టీకా తీసుకున్న తర్వాత కూడా మద్యాన్ని తీసుకోవద్దని తెలిపారు.

మన శరీరంలో తెల్ల రక్త కణాల్లో 20 నుంచి 40 శాతం వరకు లింఫోసైట్ కణాలు ఉంటాయని.. రోగ నిరోధక వ్యవస్థకు అవి చాలావరకు పనిచేస్తాయని ప్రముఖ ల్యాడ్ బైబిల్ వెబ్‏సైట్ వెల్లడించింది. కొవిడ్ టీకాను తీసుకునే ముందు… అలాగే ఆ తర్వాత ఈ లింఫోసైట్ కణాలు తగ్గితే టీకా పనిచేయదని పేర్కోంది. కనుక కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందుగానీ.. ఆ తర్వాత గానీ మద్యం తీసుకోకపోవడం వలన టీకా ప్రభావం శరీరంలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

12 ఏళ్ళు పైబడిన పిల్లలకు కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్, అనుమతించిన డీసీజీఐ, ఆందోళన అనవసరమన్న సంస్ధ