రాజకీయాల్లోకి రావాలంటే సిగ్గు…

| Edited By:

May 14, 2019 | 8:30 PM

ఏంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు… మీకు కూడా ఆసక్తి ఉందా? అని మీడియా వర్గాలు అజయ్‌ దేవగణ్‌ను అడగ్గా ఆయన చెప్పిన సమాధానం నవ్వులు చిందిస్తోంది. ‘నాకు సిగ్గెక్కువ. రాజకీయాల్లోకి రాలేను. ఎందుకంటే ఓ నేత ఎక్కడుంటే అక్కడ చాల మంది జనం ఉంటారు. నా చుట్టూ అంత మంది ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. అయితే నాకు కెమెరా ముందు ఆ బెరుకుతనం లేదు. కానీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం నా […]

రాజకీయాల్లోకి రావాలంటే సిగ్గు...
Follow us on

ఏంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు… మీకు కూడా ఆసక్తి ఉందా? అని మీడియా వర్గాలు అజయ్‌ దేవగణ్‌ను అడగ్గా ఆయన చెప్పిన సమాధానం నవ్వులు చిందిస్తోంది.

‘నాకు సిగ్గెక్కువ. రాజకీయాల్లోకి రాలేను. ఎందుకంటే ఓ నేత ఎక్కడుంటే అక్కడ చాల మంది జనం ఉంటారు. నా చుట్టూ అంత మంది ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. అయితే నాకు కెమెరా ముందు ఆ బెరుకుతనం లేదు. కానీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం నా ఉద్యోగానికి న్యాయం చేయలేను. రాజకీయాలనేది ప్రజల వృత్తి. ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వారంతా తప్పకుండా ప్రజలతో మమేకం కావాలి. నాలా సిగ్గుపడుతూ కూర్చుంటే మంచి రాజకీయ నాయకుడు కాలేరు. ఊర్మిళ, సన్నీ డియోల్‌కు నా విషెస్‌ తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారంటే తప్పకుండా వారు మంచి ఆలోచనలతో ఉండుంటారు. ప్రజలు కోరుకుంటున్న మార్పులు వారు తీసుకొస్తారని ఆశిస్తున్నాను’ అని వెల్లడించారు అజయ్‌.