Aishwarya Tests Corona Positive: బ్రేకింగ్: ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్..

Aishwarya Rai Bachchan Test Positive For Covid 19: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయ‌న‌ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌కు క‌రోనా సోకగా.. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్, బేబీ ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అటు అమితాబ్ భార్య‌ జ‌య బ‌చ్చ‌న్‌కు కరోనా నెగటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బీ ఫ్యామిలీ […]

Aishwarya Tests Corona Positive: బ్రేకింగ్: ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్..

Updated on: Jul 12, 2020 | 3:21 PM

Aishwarya Rai Bachchan Test Positive For Covid 19: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయ‌న‌ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌కు క‌రోనా సోకగా.. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్, బేబీ ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అటు అమితాబ్ భార్య‌ జ‌య బ‌చ్చ‌న్‌కు కరోనా నెగటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బీ ఫ్యామిలీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.  దీనితో అమితాబ్ ఇంటి పరిసరాలను కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు.

కాగా, అమితాబ్‌తో బాటు ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్  శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి విదితమే. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, స్వల్ప పాజిటివ్ లక్షణాలు మాత్రమే కనిపించాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.